రాప్తాడు: సోమల దొడ్డి శ్రీఅభయాంజనేయ స్వామి జయంతిలో పాల్గొని పూజలు నిర్వహించి మహిళలకు ఒడిబిము పంపిణీ చేసిన పరిటాల జ్ఞాన
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమల దొడ్డి వద్ద సోమవారం పదిన్నర గంటల సమయంలో ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల జ్ఞాన మాట్లాడుతూ సోమలదొడ్డి అభిఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించి సోమలదొడ్డి చెందిన మహిళలకు ఓడిబిము కార్యక్రమంలో మహిళలందరికీ ఒడిబిము ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని పరిటాల జ్ఞాన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మహిళలంతా పాల్గొన్నారు.