రాయదుర్గం: ఆర్టీసి బస్సును వెనుక నుంచి ఢీకొన్న టివిఎస్ ఎక్సెల్, ఒకరికి గాయాలు
రాయదుర్గం పట్టణంలోని RTO కార్యాలయం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం రాత్రి 8:45 సమయంలో అనంతపురం వెళ్తున్న RTC బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేసి నెమ్మదిగా వెళ్తోంది. అదే సమయంలో ఆయితపల్లికి చెందిన కెంచప్ప TVS XL పై వెనుక నుంచి వచ్చి బస్సును ఢీకొని కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన కెంచప్పను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రదేశం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.