మార్కాపురం: పొదిలి ఎంపీటీసీ నామినేషన్ల వివాదం: రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొదిలి ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియలో వైసీపీ అభ్యర్థులను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కర్నూలు-ఒంగోలు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ ధర్నాతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.