కనిగిరి: కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి
కనిగిరి మండలం కలగట్ల రైల్వే స్టేషన్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రైల్వే స్టేషన్ వద్ద అకస్మాత్తుగా పిడుగు పడింది. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో కూలి పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన దుర్గేష్ కుమార్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.