సంతనూతలపాడు: మద్దిపాడు పెట్రోల్ బంకులో చోరీ, కారులో డీజిల్ కోసం వచ్చి సిబ్బంది చేతిలో ఉన్న రూ.5000లు నగదుతో పరారైన నిందితుడు
మద్దిపాడు పెట్రోల్ బంకులో గురువారం చోరీ జరిగింది. కారులో డీజిల్ కొట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తి పెట్రోల్ బంక్ సిబ్బంది చేతిలో ఉన్న రూ.5000లు నగదు లాక్కొని కారులో వెళ్లిపోయాడు. కారులో వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ బైకును ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలు కూడా అయ్యాయి. కారులో చోరీ నగదుతో పరారైన నిందితుడు గుంటూరు వైపు వెళ్లినట్లు పెట్రోల్ బంక్ సిబ్బంది యజమానికి తెలిపారు. పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.