సంతనూతలపాడు: మహానాడు పై టిడిపి క్లస్టర్ ఇన్చార్జులు, మండల పార్టీల అధ్యక్షులతో సమావేశమైన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ టిడిపి క్లస్టర్ ఇంచార్జీలు మరియు మండల పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఈనెల 27, 28 తేదీల్లో వర్చువల్ గా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు టిడిపి మహానాడు కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. మహానాడు ను అందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు.