కనిగిరి: మంచి చదువుతోనే బిడ్డల భవిష్యత్తు మారుతుంది: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: తాత్కాలిక సంక్షేమ పథకాలు కంటే బిడ్డలకు మంచి చదువును అందించడం ద్వారా వారి అభివృద్ధి సాధ్యమని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు . టంగుటూరులో సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి బీసీ సంక్షేమ పాఠశాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ హాస్టల్స్ లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని, తమ బిడ్డలను హాస్టల్స్ లో చదివించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు