రాప్తాడు: పోలేపల్లి లో అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కుటుంబ సభ్యులను పరామర్శించిన యోగక్షేమాలు తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో గురువారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పోలేపల్లి లో తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి కృష్ణమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలేపల్లి రామగిరి మండలానికి చెందిన టిడిపి నేతలు పాల్గొన్నారు.