కనిగిరి: పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సురేష్
కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో రూ.1.10 కోట్ల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి కూరగాయల మార్కెట్ ను ఏర్పాటు చేశారని కనిగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దొడ్డ సురేష్ అన్నారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కూరగాయల వ్యాపారులకు మరియు ప్రజలకు ఉపయోగంగా ఉండేందుకు కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఏర్పాటు చేశారన్నారు. వినియోగదారులకు కూరగాయల మార్కెట్లో తక్కువ ధరలకే కూరగాయలు లభిస్తాయని, మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.