కనిగిరి: జనసేనలో కష్టపడి పనిచేసే వారికి పదవులు: ఒంగోలు పార్లమెంట్ జనసేన సమాచార సేకరణ పరిశీలకులు కిలారి వెంకట రోశయ్య
కనిగిరి పట్టణంలో జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు , మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీలలో నియామకల కోసం ఆశావాహుల నుండి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్యాడర్ ను పార్టీ కమిటీలలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర పార్టీలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన పదవులు వచ్చేలా అధినేత స్పష్టమైన దిశా, నిర్దేశం చేశారన్నారు.