కనిగిరి: పట్టణంలో మాజీ సీఎం వైయస్సార్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మురళీకృష్ణ
కనిగిరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఈనెల 8వ తేదీ బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ తెలిపారు. కనిగిరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎంగా వైయస్సార్ చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నారు. అటువంటి మహానాయకుడి జయంతి సందర్భంగా కనిగిరిలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడంతోపాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.