కనిగిరి: పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం, అస్పృశ్యత పై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించి, బడుగు ,బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందించాలన్నారు.