సంతనూతలపాడు: చీమకుర్తిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్ : ఎస్పీ హర్షవర్ధన్ రాజు
చీమకుర్తిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 10 రోజుల్లో ఛేదించారు. శ్రీ వెంకటేశ్వర హార్డ్వేర్ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.37 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను 5 ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నట్లు శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు.