సంతనూతలపాడు: పేర్నమిట్టలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తాడు రోడ్డుకు శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్టలో రూ.4 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న తారు రోడ్డుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ గురువారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టి ఈ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.