కనిగిరి: పట్టణంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వృద్ధుల కోసం ఉచిత మెగాకంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు పెద్ద సంఖ్యలో వైద్య శిబిరానికి తరలివచ్చారు. గుంటూరుకు చెందిన ప్రముఖ కంటి వైద్యులు వృద్ధులను పరీక్షించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని ఆపరేషన్ల కోసం ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లను నిర్వహించనున్నారు.