ఉరవకొండ: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బెలుగుప్ప మండల టాపర్ ఉప్పర దివాకర్ ను సన్మానించిన యలగల వంక గ్రామస్తులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పైకి ఉత్తమ మార్కులతో మండల టాపర్గా నిలిచిన యలగలవంక గ్రామానికి చెందిన ఉప్పర దివాకర్ 10 వ తరగతి పరీక్ష ఫలితాల్లో 575/600 మార్కులను సాధించడంతో శుక్రవారం రాత్రి గ్రామస్థులు దుశ్శాలువాలు పూలమాలలతో సన్మానించడం జరిగింది. గ్రామస్తులు విద్యార్థికి మిఠాయిలను తినిపించి సంబరాలు చేసుకున్నారు.