రాయదుర్గం: ఉడేగోళం వద్ద హైవేపై బస్సు డీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం
రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం వద్ద హైవేపై ఆర్టీసి బస్సు డీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓబయ్య తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆదివారం మద్యాహ్నం అనంతపురం వెళుతున్న ఆర్టీసి బస్సు, ఓబయ్య బైక్ ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున గుడికూడారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.