రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియు లో బీటెక్ సప్లమెంటరీ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగప్రసాద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో శనివారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జేఎన్టీయూ డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ నాగప్రసాద్ నాయుడు మార్చ్ ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ వాల్యుయేషన్ నాగ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగు సంవత్సరాలకు సంబంధించిన రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగిందని పూర్తి వివరాల కోసం ఎగ్జామినేషన్ సెక్షన్, వెబ్ సైట్ లో కానీ తెలుసుకోవచ్చు అని నాగ ప్రసాద్ నాయుడు పేర్కొన్నారు.