సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా సామూహిక ధ్యాన శిక్షణ తరగతులు
చీమకుర్తి పట్టణంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారికి ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. అనంతరం రామచంద్ర మిషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... నేడు ఒత్తిడితో కూడుకున్న జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిన అవసరం ఉందన్నారు. ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అన్నారు. దీర్ఘకాలిక రుగ్మతలను కూడా ధ్యానం చేయడం ద్వారా నయం చేసుకోవచ్చని సూచించారు.