రఘునాథపల్లె: రఘునాథపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి.. ఉద్యమ స్ఫూర్తిని చాటిన సీపీఎం
రఘునాథపల్లిలో చాకలి ఐలమ్మ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో భూస్వామ్య దోపిడీపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.