సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో విద్యార్థులకు వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కరాటే పై శిక్షణ
నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని ప్రభుత్వ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు కరాటే పై శుక్రవారం శిక్షణ కార్యక్రమం కొనసాగింది. విద్యార్థులు ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని, అందులో మెలుకువలు తెలుసుకోవాలని గ్రంథ పాలకురాలు ధనమ్మ సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ రకాల వ్యాయామాలు చేసి చూపించి, వాటిని విద్యార్థులు క్రమం తప్పకుండా నిత్యం చేయాలన్నారు. విద్యార్థులు మంచి ఆరోగ్యం కోసం వ్యయమాలు, పౌష్టికాహారం తీసుకోవాలని గ్రంథ పాలకురాలు ధనమ్మ సూచించారు.