కనిగిరి: చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను ఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని, వాటిని త్రుతగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నేర నియంత్రణకు కృషి చేయాలని, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని పోలీసులకు సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పామూరు సిఐ భీమా నాయక్, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.