కనిగిరి: హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో సమావేశమైన ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు
హనుమంతుని పాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు గురువారం సమావేశమయ్యారు. పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించిన నేపథ్యంలో వారితో ఎంపీడీవో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు గ్రామపంచాయతీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల వారీగా ఆదాయాలు, వ్యయాల పై ఎంపీడీవో ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.