ఉరవకొండ: బీసీ వర్గాల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 26న వైయస్సార్సీపి చేపట్టిన" బీసీ గళం" పోస్టర్ల ఆవిష్కరణ
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ వర్గాల హక్కుల సాధనే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో జరగనున్న బీసీ గళం పోస్టర్లను ఆవిష్కరించారు. బీసీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు కడమలకుంట సురేష్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి గోకుల పుల్లయ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్లు స్థానిక నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. రాయలసీమ జిల్లాల నుంచి బీసీ వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనే సభతో బీసీల ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.