కనిగిరి: పామూరు పంచాయతీలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టిన పంచాయతీ అధికారులు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పంచాయతీలో ఆదివారం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా పంచాయతీ అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డులో ఆక్రమించుకుంటూ డ్రైనేజీ కాలువలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను జెసిబి మరియు కూలీల సహాయంతో పంచాయితీ అధికారులు కూల్చివేశారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా పామూరు పంచాయతీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆక్రమణలను తొలగించినట్లుగా పంచాయతీ అధికారులు తెలిపారు.