కనిగిరి: పట్టణంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు
కనిగిరి పట్టణంలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో విద్యుత్ శాఖ అధికారులు నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని బొడ్డు చావిడి, కోట్ల బజారు, రామాలయం వీధిలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు ఎప్పుడు కూలుతాయానని ఆందోళనకు చెందిన స్థానికులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం కోట్ల బజార్, బొడ్డుచావిడి, రామాలయం వీధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో స్థానికుల్లో హర్షం వ్యక్తమౌతుంది.