కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ మహోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకీని భక్తులు స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామివారి తీర్థ, ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.