కనిగిరి: ట్రిపుల్ ఐటి కళాశాల నిర్మాణానికి రూ.19 కోట్లు నిధులు మంజూరు: కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి
కనిగిరి మండలం బల్లిపల్లి వద్ద నూతనంగా నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.19 కోట్లు నిధులను మొదటి విడతగా మంజూరు చేసిందని కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు దొడ్డ సురేష్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి కనిగిరి ప్రాంతంలోని ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారన్నారు. ఈ ప్రాంత విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ కళాశాల ఒక వరం అన్నారు.