వికారాబాద్: భూ వివాదాలు, సివిల్ తగాదాలు వంటి విషయాలలో పోలీసుల జోక్యం ఉండదు -జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.
భూ వివాదాలలో సివిల్ తగాదాలలో పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోరని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. దోమ మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామంలో ఇద్దరి మధ్య జరిగిన భూవివాదాన్ని కొంతమంది ప్రజాసంఘాల నాయకులు తమ స్వలాభం కోసం పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులను కించపరిచే విధంగా తప్పుడు కథనాలు అవాస్తవాలు రచించడం జరిగిందని, వారిపై, యజమాన్యం పై నోటీసులు ఇచ్చి,పరువు నష్టం దావా కేసులు వేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.