కనిగిరి: జూలై 5 న జరిగే శ్రీ షిరిడి సాయిబాబా మహా భక్తి సమ్మేళనం జయప్రదం చేయాలి: కనిగిరి సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు సత్యాలు
కనిగిరి: జూలై 5వ తేదీన మార్కాపురంలో జరిగే మార్కాపురం జిల్లా శ్రీ షిరిడి సాయిబాబా మహాభక్తి సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి పట్టణ శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు కోరారు. మార్కాపురంలో జరిగే మహా భక్తి సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ షిరిడి సాయిబాబా మహా భక్తి సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.