కొండపి: కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిపోర్ట్ ను పరిశీలించి నేరాలు చేసే వారిపై నిఘ ఉంటుందని తెలిపిన సిఐ సోమశేఖర్
ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్ లో బుధవారం సీఐ సోమశేఖర్ క్రైమ్ రిపోర్ట్ పై పరిశీలించారు. ఇటీవల జరిగిన నేర సంబంధిత విషయాలపై ఎస్సైలు మరియు సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారిపై నిరంతరం నిఘ ఉండాలన్నారు. అలానే అత్యధికంగా నేరాలు జరుగుతున్న గ్రామాల పరిసర ప్రాంతాల మ్యాపులను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సాధించినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.