రాప్తాడు: రాప్తాడు లో పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం 11:30 గంటల సమయంలో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా సిపిఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాల రంగయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధం పేరు చెప్పి మూడుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగిందని వీటిని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామని ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని లేకుంటే మరిన్ని ఆందోళన చేపడతామని వామపక్ష పార్టీ నేతలు హెచ్చరించారు.