ఉరవకొండ: మాలాపురం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలాపురం గ్రామానికి చెందిన బోయ సుంకమ్మ(68) మంగళవారం సాయంత్రం కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా ఉరవకొండ నుండి విడపకల్లు కు వెళ్లే ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు సుంకమ్మను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది . రోడ్డు ప్రమాద ఘటనపై విడపనకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు