రాయదుర్గం: సిఐ హామీతో ఆందోళన విరమించిన 74 ఉడేగోళం గ్రామస్తులు
వారం రోజుల్లో స్పీడ్ బ్రేకర్లు వేయించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఇచ్చిన హామీతో 74 ఉడేగోళం వాసులు శాంతించారు. ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా తరచూ రోడ్డు ప్రమాదాలపై స్థానికులు రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిని దిగ్బందించారు. దీంతో సిఐ అక్కడికి చేరుకుని హైవే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.