రాప్తాడు: మనీలా గ్రామంలో ప్రభుత్వ భూములు రక్షించుకుంటాం మనీలాలో రాప్తాడు సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని మనీలా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు రక్షించుకుంటామంటూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ మనీలా గ్రామంలో ప్రభుత్వ భూములు చెక్ డాం ఆక్రమించుకొని నీటి నిలువ ఉండకుండా రాళ్లతో నింపి వేస్తున్నారని పోరాటాలు చేసేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళిపోతున్నామని సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు పేర్కొన్నారు.