ఉరవకొండ: తగ్గుపర్తిలో ఒక నెల ఒక గ్రామ కార్యక్రమం
అనంతపురము జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు ఒక నెల ఒక గ్రామము అనే కార్యక్రమంలో భాగంగా బెళుగుప్ప మండలం లోని తగ్గుపర్తి గ్రామం నందు గురువారం గ్రామ సభను తహసీల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. గ్రామ సభలో భూముల సమస్య మరియు ఇతర సమస్యలు ఉన్న యెడల తెలియజేయవలసిందిగా కోరడమైనది.సదరు గ్రామ సభ యందు అందరూ మండల స్థాయి అధికారులు పాల్గొనడం జరిగినది. మరియు అదేవిధముగా తగ్గుపర్తి యందు రీ సర్వే పూర్తి అయినందున రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు గురు బ్రహ్మ ,గ్రామ రెవెన్యూ అధికారులు ప్రదీప్ పాల్గొనడం జరిగినది.