శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాజీ ఎంపీ రంగయ్యకు లేదని మాజీ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పాలాక్షి అన్నారు.కళ్యాణదుర్గంలో సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మాట్లాడారు.టీడీపీ నేత మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైపీ రమేష్ మా నాయకుడు తలారి రంగయ్య శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారన్నారు. అలాంటి కర్మ రంగయ్యకు పట్టలేదన్నారు.ఎవరు శవ రాజకీయాలు చేస్తున్నారో, రాబందులు ఎవరో అందరికీ తెలుసన్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఇస్తాను సారం మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. రంగయ్యను మరోసారి ఇష్టానుసారం మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.