రాప్తాడు: గోరిదిండ్ల గ్రామంలో కేశవరెడ్డి మా భూమిని ఆక్రమించుకొని మా పైనే దౌర్జన్యం చేస్తున్నాడు ఆత్మకూరులో దళిత నేత శంకర్ ఆరోపణ
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం రెండున్నర గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గోరిదిండ్ల గ్రామంలో కేశవరెడ్డి అనే వ్యక్తి పెద్దక్క అయిదు ఎకరాలు ముత్యాలమ్మ కు చెందిన ఐదు ఎకరాలను గత మూడు సంవత్సరాలగా అక్రమంగా సాగు చేసుకుంటూ భూ యజమానులు పైనే దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి వారిపై ఇప్పటికైనా విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించిన స్థానిక పోలీసులు కేశవరెడ్డికే సహకారం అందిస్తున్నారని ఇలాంటి వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని రాప్తాడు కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ ఆరోపణ చేశారు.