రాప్తాడు: చిన్మయి నగర్ లో ఎల్ ఆర్ జి పాఠశాల నందు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న ఎల్ ఆర్ జి పాఠశాలలు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ బొంతు ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ సమయపాలన బాధ్యతాయుతమైన ప్రవర్తన సేవా భవం అలవర్చుకోవాలని అందులో భాగంగానే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎంపిక చేసి వారికి పట్టాభిషేకం నిర్వహించడం జరిగిందని కరస్పాండెంట్ బొంతు ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.