కనిగిరి: చంద్రశేఖరపురం మండలం భైరవకోనలో పూజారి రామమూర్తి పై కత్తితో దాడి , పూజారికి గాయాలు
చంద్రశేఖరపురం మండలం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న రామమూర్తి పై ఆదివారం ఆలయ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో పూజారికి గాయాలయ్యాయి. స్థానికులు పూజారిని పామూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోటార్ బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి 2 సార్లు కత్తితో భుజంపై దాడి చేయడంతో గాయాలైనట్లు పూజారి రామమూర్తి తెలిపాడు.