తాడిపత్రి మండలం సజ్జలదిన్నె ఆలూరు రోడ్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేప చెట్టుకు వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి చూస్తే రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.