రాయదుర్గం: ప్రతీఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి : రూరల్ సీఐ వెంకటరమణ
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కోరారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు శనివారం రాయదుర్గం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కొంతమంది యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో పాల్గొని ప్రజలను ఆకట్టుకున్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని సీఐ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎస్ఐలు సురేష్, నాగమధు, చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.