ఉరవకొండ: సైబర్ నేరాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో స్థానిక వెలుగు ఆఫీస్ నందు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మండల అధికారులతో కలిసి స్థానిక ఎస్సై శివ మహిళలు మరియు బాల బాలికల భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. శక్తి యాప్ , సైబర్ నేరాల పై అవగాహన, గంజాయి, డ్రగ్స్ నిర్ములన, రోడ్ భద్రత పై అవగాహన, చైల్డ్ మ్యారేజ్ నిర్ములన వంటి అంశాలు పై అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో డిటి గురుబ్రహ్మ, ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ రమాదేవి, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, వెలుగు మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.