ఉరవకొండ: వెలిగొండ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గేటు విరిగిపడి విద్యార్థికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గేటు ఒక్కసారిగా విరిగిపడటంతో చెన్నరాయుడు అనే మూడవ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులతో కలిసి గేటు పట్టుకుని ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థిని ఉపాద్యాయులు, గ్రామస్తులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.