కనిగిరి: పట్టణంలో పర్యటించిన రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్
కనిగిరి పట్టణంలో రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. ఆధ్యాత్మికత ఉత్తిపడేలా కనిగిరి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని, ఆలయ కమిటీ సభ్యులను మంత్రికి భరత్ అభినందించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవకి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్యులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.