ఉరవకొండ: నీట్ పరీక్షా లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి:వైయస్సార్ విద్యార్థి విభాగం
దేశవ్యాప్తంగా మే 4వ తేదీన 20 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాసారని పేపర్ లీకేజ్ జరిగిందని పరీక్షను రద్దు చేయడాన్ని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కూడేరులో ఈ సందర్భంగా మంజునాథరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల అవస్థలు ప్రభుత్వానికి పట్టడం లేదని, రెండు సంవత్సరాలు పేపర్ లీకు నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.