కనిగిరి: టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన చేపట్టిన మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి బుధవారం మంగళగిరిలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధితులు చేపట్టిన మంత్రి లోకేష్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి కండువా కప్పి అభినందించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేశారని, నేడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో నవ శఖానికి నాంది పలికినట్లు అయిందని ఎమ్మెల్యే తెలిపారు.