కనిగిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ యాదవ్ సూచించారు. శుక్రవారం హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామానికి సంబంధించి పార్టీ సంస్థ గత కమిటీల నియామక జాబితాను నాయకులు నారాయణ యాదవ్కు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి గెలుపొందే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హనుమంతునిపాడు మండలంలో కూడా అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయవలసి ఉంటుందని నారాయణ యాదవ్ నాయకులకు సూచించారు.