గిద్దలూరు: గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు జీతాల కోసం ఇబ్బందులు పడ్డారు: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో జీతాల కోసం ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం గిద్దలూరు మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతినెల 1వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలతో పాటు పెన్షన్ దారులకు పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అలానే రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.