కనిగిరి: మార్కొండపురంలో భార్యను రక్షించబోయి విద్యుత్ షాక్ తో భర్త మృతి
పామూరు: భార్యను రక్షించబోయి విద్యుత్ షాక్ తో భర్త మృతి చెందిన సంఘటన పామూరు మండలం మార్కొండాపురంలో శనివారం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కొండపురం గ్రామంలో దగ్గుపాటి పెద్ద వెంగయ్య భార్య రాములమ్మ వాటర్ పైపుతో ఇల్లును శుభ్రం చేస్తున్న క్రమంలో ప్లగ్ బాక్సులోకి నీరు చేరడంతో విద్యుత్ షాక్ తగిలి కేకలు వేసింది. గమనించిన భర్త పెద్ద వెంగయ్య ప్లగ్ బాక్స్ ను చేతితో తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పెద్ద వెంగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.